అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మ హత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలో బుదవారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ నగరంలోని ఆర్య నగర్ కూ చెందిన లావణ్య(23)కు వెంకటేష్ అని వ్యక్తి తో 8నెలల క్రితం వివాహమైంది. వివాహం జరిగిన కొద్ది రోజులుగా తరుచూ భర్త,అత్తమామలు అదనపు కట్నం కోసం వేదించేవారని తెలిపారు. ఈక్రమంలో ఆషాడ మాసం కావడంతో సుభాష్ నగర్లో నీ పుట్టింటికి వెళ్ళింది.
ఈ మేరకు అత్యంత వేధింపులు తాళలేక మంగళవారం రాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
