మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన నగరంలోని రెండవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్ తెలిపిన వివరాల ప్రకారం..
అబం శుభం తెలియని ఐదేళ్ల బాలిక విధిలో ఆడుకుంటున్న సమయంలో గణేష్(40) అనే వ్యక్తి చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అగయిత్యానికి పాల్పడ్డాడు.
గురువారం చిన్నారి కడుపు నొప్పి ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.
ఈ మేరకు బాధితులు రెండో ఠాణాలో ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాము తెలిపారు.
