ప్రమాదవశాత్తు కాలువలో పడి మహిళ మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇందల్వాయి మండలంలోనీ సిర్ణపల్లి క్యాబిన్ తండాకు చెందిన కట్రోత్ భారతి(35). నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.భారతి వికలంగురాలు.
గురువారం అర్ధ రాత్రి సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలు జారీ పక్కనే ఉన్న కాలువలో పడి కొట్టుపోయి నల్లవెల్లి శివారులో మృతి చెందినట్లు తెలిపారు.
స్థానిక రైల్వే ఉద్యోగులు చూసి కుటుంబ సభ్యులకు,పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మనోజ్ తెలిపారు.