బెల్ట్ షాప్ ల్లో మద్యం అమ్మకాలను అడ్డుకోవడానికి రంగంలోకి దిగిన ఆబ్కారీ దాడులతో హడలెత్తిస్తారని బెల్ట్ షాప్ నిర్వాహకులు బెంబేలెత్తిపోయారు.
సమీపం లోని ఓ బడా మద్యం వ్యాపారి ఆశ్రయించారు. అంతే అరగంట లోనే సదురు మద్యం వ్యాపారి ఎంట్రీ ఇవ్వడంతో అప్పటిదాకా చెలరేగిపోయిన అధికారులు తోకముడిచి వెళ్లిపోయారు.
కేసులు పెట్టకుండా మద్యం స్వాధీనం చేసుకోకుండా అధికారులు వెనుదిరగడంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు. జిల్లాకేంద్రం కు జస్ట్ నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాల్లో జరిగింది.
మాక్లూర్ మండల అమ్రాద్,ముత్యం పల్లి, ఒడ్యాట్ పల్లి, పలు గ్రామాల్లో బెల్టు షాపులు నడుస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గురువారం అబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయా షాప్ ల్లో సోదాల పేరుతొ చెలరేగిపోయారు.
నిర్వాహకుల మీద నిప్పులు చెరిగారు. ఎప్పడు లేని విధంగా ఆబ్కారీ అధికారులు బెల్ట్ షాప్ లు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాయి అంటూ బెల్ట్ షాప్ నిర్వాహకులు బెంబేలెత్తిపోయారు.
పైగా కేసులు పెడతామని బెదిరించారు బెల్ట్ షాప్ ల్లో లభ్యం అయిన మద్యాన్ని అబ్కారీ శాఖ కార్యాలయనికి తరలించారు.లక్షలాది రూపాయల విలువైన మద్యం చేజారిపోయింది. దీనితో గాబరా పడ్డ నిర్వహకులు ఓ మద్యం వ్యాపారి ని ఆశ్రయించారు.
అర గంటలో ఆ లిక్కర్ కింగ్ ఎంట్రీ ఇచ్చేసాడు. ఆబ్కారీ అధికారులతో బేరం మొదలు పెట్టారు. బేరం ఏ మేరకు కుదిరిందో కానీ బెల్ట్ షాప్ నిర్వాహకులను వదిలేసారు.
అంతే కాదు బెల్ట్ షాప్ లో స్వాధీనం చేసుకున్న లిక్కర్ ను సైతం నిర్వహకులకు ఇచ్చేసారు. కేసు పెట్టి బొక్కలో వేస్తామని బీరాలు పలికిన ఆబ్కారీ అధికారులు లిక్కర్ కింగ్ డీల్ తో తోక ముడిచారు. మొత్తానికి బెల్ట్ షాప్ లమీద దాడులతో ఆబ్కారీ అధికారులకు బేరం సెట్ అయింది.