బ్యాంక్ టోకరా.. నిందుతుడు రిమాండ్…నగరంలోని శివాజీ నగర్ లోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ ను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సీఐ నరహరి తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ లో మేనేజర్ గా పనిచేస్తున్న అజయ్ జూలై లో42 మంది ఖాతాదారుల అకౌంట్ నుంచి ఖజానాను బురిడీ కొట్టించి తన వ్యక్తి గత ఖాతా లోకి మలించుకున్నాడు.
అందుకు ఖాతదురులు జూలై 17 న నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు సిఐ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
బ్యాంకు అధికారులతోనూ మాట్లాడి వివరాలు సేకరించగా మేనేజర్ అజయ్ రుణాలు మంజూరు చేసే సమయంలో వారిని నమ్మించి రూ.4 కోట్ల రూపాయలను తన వ్యక్తిగత ఖాతాలోకి మల్లించుకొని మోసం చేసినట్లు గుర్తించారు.
అందుకు కారణం శుక్రవారం నిందుతుడు అజయ్ ను నేడు ప్రవేశపెట్టనున్నట్లు సీఐ నరహరి తెలిపారు.