వాగులో కొట్టుకొచ్చిన గుర్తు తెలియని మృత దేహం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.
నిజామాబాద్ రూరల్ మండలంలోని కొండూర్ గ్రామ శివారులోని వాగులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించరు. గ్రామస్తులు రూరల్ పోలీస్ లకు సమాచారం అందించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు 50 ఉంటుంది తెలిపారు.మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.