నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ ఫరీద్ లో ఇటీవలే బదిలీ అయిన కొంత మంది ఎస్సై లకు సంబంధించి బదిలీ ఉత్తర్వ్యూలు నిలిపి వేశారు. బాసర జోన్ పరిధి లో సుమారు నలభై మూడు మంది ఎస్సై లు బదిలీ అయ్యారు.
వారందరిని బుధవారం రిలీవ్ కావాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ముగ్గురు ఎస్సై లకు సంబందించి బదిలీ ఉత్తర్వ్యూలు మాత్రం నిలిపి వేశారు. ముగ్గురు ఎస్సై లను మాత్రం రిలీవ్ కావద్దని ఆదేశాలు జారీచేశారు.
ఇందులో మూడో టౌన్ ఎస్సై ప్రవీణ్, ముప్కాల్ ఎస్సై డిచ్ పల్లి ఎస్సై మహేష్ ల ను మాత్రమే రిలీవ్ కావద్దని అక్కడే కొనసాగాలని పేర్కొన్నారు. ఈ ముగ్గురి బదిలీ లు ఎందుకు నిలిపి వేసారనేది ఇంకా తెలియరాలేదు
