సీఐ ల బదిలీ ల వ్యవహారం అధికార పార్టీలో చిచ్చు రేపింది. బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో జరిగిన ఎనిమిది మంది సీఐ ల బదిలీ లపై అధికార పార్టీలో రచ్చ జరుగుతుంది.
తమ సిఫార్స్ చెల్లుబాటు కాకపోవడంతో అధికార పార్టీ నేతలు రగిలి పోయారు. వ్యవహారం హైదారాబాద్ కు వెళ్లిన నేపథ్యంలో బదిలీ లు నిలిచి పోయాయి.
సీఐ పోస్టింగ్ ల మాటున భారీఎత్తున వసూళ్ళ దందా జరిగిందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. స్థానిక నాయకుల ఒత్తిడి తో జిల్లాకు కు చెందిన ఓ మాజీ మంత్రి తనయుడు నిర్వహకం ను కమీషనర్ ముందే పసిగట్టి నట్లు సమాచారం.
అందుకే సీఐ ల పోస్టింగ్ సిఫారస్ లు పట్టించుకోలేదు.కేవలం మెరిట్ మేరకే పోస్టింగ్ లు ఇచ్చారు. కమిషనరేట్ పరిధి లోపలువురు సీఐ లు గత ప్రభుత్వంలో పోస్టింగ్ లు పొందిన వారే కావడంతో వారి స్థానంలో కొత్తవారి కి పోస్టింగ్ లు ఇప్పించడానికి గత నాలుగు మాసాలుగా అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కీలక పైన పోస్టింగ్ చేజిక్కించుకోవడానికి కొందరు సీఐ అధికార పార్టీలో కీలక నేతలను ఆశ్రయించారు. ఒక్కో పోస్టింగ్ కోసం ఇద్దరు ముగ్గురు సీఐ లు పోటీ పడ్డారు.
ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ నేతలు పోస్టింగ్ లకు వేలం పెట్టారు.రూ 5 నుంచి 7 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఎహే ఆ మాత్రం ఇవ్వలేమా అన్నట్లుగా కొందరు సీఐ అడ్వాన్స్ గానే నగదు ముట్టజెప్పారట.
అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత మధ్యవర్తి స్వయంగా మాజీ మంత్రి తనయుడు ఈ వసూళ్ల కు తెరలేపారు.ఆ మేరకు ఆ అధికారులకు పాలన చోట పోస్టింగ్ లు ఇవ్వాలంటూ సిఫారస్ చేసాడు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ తనుకూడా పెత్తనం సాగించే ఆలోచనలో ఉన్న మరో అధికార పార్టీ కీలక నేత సైతం అదే స్థానాలకు మరో అధికారులపేర్లు రికమండ్ చేసాడు.
అయితే సీఐ పోస్టింగ్ వ్యవహారాల్లో వసూళ్ల దందా ను కమిషనర్ ముందే పసిగట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకే సిఫారస్ లను పక్కకు పెట్టేసి జిల్లాలో పనిచేస్తున్న వారిలోనే కొందరికి మెరిట్ ఆధారంగా పోస్టింగ్ లు ఇచ్చేసారు .
ఈ మేరకు బుధవారం ఉత్తర్వ్యూలు వెలబడ్డాయి. విషయం తెల్సిసదరు మాజీ మంత్రి రంగంలోకి దిగి ఉన్నత స్థాయి లో పిర్యాదు చేసి బదిలీ లను నిలిపి వేయించారు. కానీ మాజీ మంత్రి తనయుడి వసూళ్ల నిర్వాహకం ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది
