జిల్లాలో 8 మంది సివిల్ సీఐలను బదిలీ చేస్తూ బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు.అలాగే వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. వెయిటింగ్ లిస్టు లో ఉన్న రఘు పతి ని నిజామాబాద్ 1టౌన్ కు బదిలీ అయ్యారు.
అక్కడ ఉన్న D.విజయ్ బాబు బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యారు.. బోధన్ రూరల్ లో కోట నరేష్ కుమార్ నిజామాబాద్ ట్రాఫిక్ సిఐగా బదిలీ అయ్యారు.
ట్రాఫిక్ సిఐ వెంకట్ నారాయణ బోధన్ టౌన్ సీఐ గా బదిలీ అయ్యారు. బోధన్ టౌన్ లో ఉన్న వీరయ్య నిజామాబాద్ లోని సి సి ఆర్ బీ బదిలీ అయ్యారు.
సి సి ఆర్ బీ లో ఉన్న శ్రీనివాస్ రాజు నిజామాబాద్ టౌన్ సిఐగా బదిలీ అయ్యారు. నిజామాబాద్ టౌన్ సిఐ గా ఉన్న నరహరి నాయక్ తో పాటు టాస్క్ ఫోర్స్ లో ఉన్న అంజయ్య లు మల్టి జోన్ 1 ఐజి ఆఫీసుకు. బదిలీ అయ్యారు
