HomeCRIMEజీజీహెచ్ లో జుడాల ఆందోళన...నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

జీజీహెచ్ లో జుడాల ఆందోళన…నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

జీజీహెచ్ లో జుడాల ఆందోళన…నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్‌పై ఇటీవల జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో బుదవారం ఆందోళన చేశారు.

ఈమేరకు నిజామాబాద్ జిల్లా జూడ అధ్యక్షుడు జితిన్ మాట్లాడుతూ..కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో రెండవ సంవత్సరం పిజి విద్యార్థిని దారుణంగా చంపడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనుమానించబడిన ఈ క్రూరమైన నేరం, వైద్య సంస్థలు మరియు ఆసుపత్రులలో తీవ్రమైన భద్రతా సమస్యలను ఎత్తిచూపుతుందని ఎద్దేవ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు, న్యాయం జరిగే వరకు సమ్మెను విరమించబోమని డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.

నో సేఫ్టీ-నో డ్యూటీ అంటూ నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అడ్వైజర్ ప్రణయ్, స్టేట్ వైస్ ప్రసిడెంట్ రమ్య,గ్రీష్మ, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments