HomeCRIMEబాలుడిపై వీధి కుక్కల దాడి..

బాలుడిపై వీధి కుక్కల దాడి..

నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ డైరీ ఫాం దగ్గర బాలుడిపై వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు..

నగర శివారులోని సారంగాపూర్ డైరీ ఫారం ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న షేక్ సుమేర్ అనే బాలుడి పై విచక్షణారహితంగా దాడి చేశాయి.

ఈ దాడిలో సుమేర్ తలకు,చెవికి గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాలుడుని తల్లిదండ్రులు, హుటాహుటిన నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

గతంలో కూడా మరో ఇద్దరు వ్యక్తులు పై కుక్కలు దాడులు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలను నియంత్రించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్య పట్టనట్లు వ్యవహరించారని వారి నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు వీధి కుక్కల దాడిలో గాయపడ్డాడని సుమెర్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇప్పటికైనా వీధి కుక్కలను నియంత్రించి వాటి బారి నుంచి తమ పిల్లలను కాపాడాలని బాధిత తల్లిదండ్రులు, కాలనీ వాసులు వేడుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments