నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్డులో నూతన నిర్వహిస్తున్న ఓ భవనం యాజమాని దర్జాగా నడిరోడ్డు పైనే ఇసుక డంపింగ్ చేశారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది.
నడిరోడ్డు పైన ఇసుక డంపింగ్ చేయడంతో ట్రాఫిక్ ఇక్కట్లు కు గురవుతున్నామని వాహనదారులు విమర్శలు చేస్తున్నారు.
నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ తో పలు ప్రాంతాల్లో ఇక్కట్లు పడుతున్నరని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి ఇసుక డంపింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.