Tuesday, April 21, 2026
HomeCRIMEరక్షిత మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ను ముట్టడించిన విద్యార్థి...

రక్షిత మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు ……ఉద్రిక్తత నాయకుల అరెస్టు

అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రక్షిత మృతిపై సీబీఐ తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళన కు దిగాయి. .

విద్యార్థి మృతి పై విచారణ జరిపించి, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వద్ద PDSU, USFI, BSP AIPSU, PYL ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ,

పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులు తోపులాట జరిగింది అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి వర్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, USFI పెద్ది సూరి మాట్లాడుతూ శనివారం రోజున అనుమానస్పద స్థితిలో హాస్టల్ బాత్రూంలో చనిపోయిన విద్యార్థి రక్షిత మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని,

విద్యార్థి రక్షిత చనిపోయే ముందు సీసీ కెమెరాలు అదే సమయంలో పనిచేయకపోవడం , కుటుంబ సభ్యులు రాకముందే అమ్మాయి మృతదేహాన్ని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించడం చూస్తుంటే పోలీసులు అధ్యాపకులు కలిసి లోపాయికారీ ఒప్పందానికి పాల్పడ్డట్టు అనుమానాలు వస్తున్నాయి .

మృతి చెందిన విషయాన్ని కుటుంబానికి తప్ప బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేశారని,నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని , ఘటనకు నైతిక బాధ్యులైనప్రిన్సిపాల్ మరియు వార్డెన్ పై చర్యలు చేపట్టాలి .

చనిపోయిన అమ్మాయి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు నడిపింటి కార్తీక్ ,

PDSU నాయకులు దేవిక , సాయినాథ్ , AIPSU సాయికుమార్ ,USFI నాయకులు మహేష్ , PYL నాయకులు సుధాకర్ ,BSP నాయకులు శ్యామ్, ఇందుర్ సాయిలు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!