నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ కి చెందిన 40వ డివిజన్ కార్పొరేటర్ శివచరణ్ ఇంటి ముందు నుండి సురేష్ అనే వ్యక్తి వెళుతున్నప్పుడు అతనిని అడ్డుకొని
తన ఇంటి ముందు నుండే వెళ్తావా అని సురేష్ నీ బెదిరించి అతనిని బూతు మాటలు తిట్టి , కార్పొరేటర్ శివ చరణ్ మరియు అతని తమ్ముడు ప్రమోదులు సురేష్ ని కొట్టినారు.
గాయస్తుడైన సురేష్ సోమవారం మూడవ ఠాణా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ శివ చరణ్ మరియు అతని తమ్ముడు ప్రమోదుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ యు మహేష్ తెలిపారు.
