గత రెండు రోజుల నుంచ కురుస్తున్నటువంటి భారీ వర్షానికి రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి బ్రిడ్జి పైన రాకపోకలను నిలిపివేశారు.
ఉదయం నుండి గోదావరి గంట గంటకు నీటి ప్రభావం ఎక్కువ కావడంతో గోదావరి బ్రిడ్జికి దగ్గరగా నీరు ప్రవహించడంతో బ్రిడ్జి పైనుండి రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.
ధర్మాబాద్ కు వెళ్ళవలసిన వాళ్లు బాసర వైపు నుండి వెళ్ళాలని వారు సూచించారు .గోదావరి తీర ప్రాంతానికి ఎవరు రాకూడదని ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్దనే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
