నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరి చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళ్లితే
నగరంలోని బ్యాంక్ కాలానికి చెందిన శ్రీనివాస్ గత మూడు రోజుల క్రితం పనులు నిమిత్తం కుటుంబం తో కలిసి ఊరీకి వెళ్లి సోమవారం రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగల గొట్టి ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇంట్లొకి వెళ్లి చూడగా బీరువా ధ్వంసం చేసి ఉన్నట్లు తెలిపారు.గమనించిన శ్రీనివాస్ ఐదవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. కొంత నగదు,బంగారం,వెండి అపహరించినట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
