HomeCRIMEపాముకాటుతో మహిళ మృతి..

పాముకాటుతో మహిళ మృతి..

పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని తరకనగర్ కు చెందిన దండేవర్ లక్ష్మిబాయి(46).

వృతి కూలీ పనులు చేసుకుంటారు. ఆగస్ట్ 31 న రోజువారీగా కూలీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. అర్థ రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైంది.

దీంతో పక్కనే ఉన్న కొడుకు తెలపడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కుడుకు మాధవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎండీ ఆరీఫ్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments