– ఎస్సారెస్పీకి తరలివస్తున్న పర్యాటకులు రాసుకోవడం
ఉత్తర తెలంగాణ వరప్రధాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు 41 గేట్లను ఎత్తివేసి గోదావరిలోకి వరద నీటిని వదులుతున్నారు.
దీంతో మొన్నటి వరకు శాంతించిన గోదారమ్మ ఒక్కసారి పరవళ్ళు తొక్కుతూ ఉప్పొంగుతోంది.
ఎగువ మహారాష్ట్రలో నుండి భారీ స్థాయిలో ఇన్ఫ్లో రావడంతో పాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా పట్టుకున్న ముసురు కారణంగా పెద్ద మొత్తంలో వరద నీరు రావడంతో నిన్నటి రోజు అధికారులు 40 గీత ద్వారా నీటిని వదిలారు.
గత రాత్రి ఇన్ఫ్లో మరింత పెరగడంతో మరో గేటును కూడా తెరిచి మొత్తం 41 గేట్ల ద్వారా గోదావరి నదిలోనికి నీటిని వదులుతున్నారు.2,59,928 క్యూసెక్కుల నీటిని గోదావరిలోనికి వదులుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు.
