HomePOLITICAL NEWSArmoorరాజస్థానిలను పీక్కతిన్న... రాబందులు- లబోదిబోమన్న రాజస్థానీ కళాకారులు- గణేష్ విగ్రహ తయారీదారులతో నెలకొన్న రగడ- రాజస్థానీ...

రాజస్థానిలను పీక్కతిన్న… రాబందులు- లబోదిబోమన్న రాజస్థానీ కళాకారులు- గణేష్ విగ్రహ తయారీదారులతో నెలకొన్న రగడ- రాజస్థానీ వ్యాపారులు వర్సెస్ స్థానికులు- విగ్రహదారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

వినాయక విగ్రహాల తయారీ కోసం గత ఎన్నో ఏళ్లుగా.. ఎంతో శ్రమిస్తూ తమ కళారూపాలను వినాయక విగ్రహాల రూపంలో కనపరుస్తున్న రాజస్థానీ కళాకారులను ఆర్మూర్ పట్టణంలో రాబందులు పీక్కు తింటున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి గణేష్ విగ్రహాల వ్యాపారాన్ని చేయడానికి వచ్చిన రాజస్థానీ కుటుంబాలపై స్థానిక వ్యాపారుల అజమాయిషి పెరగడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నట్టు సమాచారం.

గత ఏడాది ఇదే విషయమై తమకు డబ్బులు చెల్లించాలంటూ స్థానికులకు, రాజస్థానీలకు మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా జరిగినట్లు తెలిసింది.

అయితే మధ్యవర్తుల చొరవతో అంతర్గతంగా ఈ విషయాన్ని సెటిల్మెంట్ చేసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. మరో పక్క కోటార్మూర్ లో జాతీయ రహదారికి పక్కనే గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్న యజమానుల నుంచి వసూలు చేసే పన్ను విషయంలో తై బజార్ కాంట్రాక్టర్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులకు మధ్య జరిగిన వివాదం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది.

సుమారు 30 షెడ్లను ఏర్పాటు చేసిన తయారీదారులు గణేష్ విగ్రహాలను తయారు చేశారు. తయారుదారుల నుంచి ఒక్కొక్కరి నుండి 4000 చొప్పున వసూలు చేసి రసీదులు ఇచ్చారు.

అది చాలదన్నట్టు భారీ షెడ్లు వేసిన కారణంగా మున్సిపల్ కు అదనంగా డబ్బులు కట్టాలని మున్సిపల్ సిబ్బంది వెళ్లి వారిని వేధించినట్లు రాజస్థానిలు వాపోయారు.

స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం వారి నుండి డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ విషయం కాస్త ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వద్దకు చేరింది.

ఆర్మూర్ మున్సిపాలిటీ ఆకస్మిక తనిఖీకి వచ్చిన సందర్భంలో రాకేష్ రెడ్డికి రాజస్థాన్లో తమ గోడు వెళ్ళబోసుకోవడంతో తయారీదారుల పక్షంగా రాకేష్ రెడ్డి మున్సిపల్ అధికారులను వారించారు.

గణేష్ విగ్రహ తయారీదారుల పన్ను వసుళ్లపై మున్సిపల్ లో దశలో తీవ్రమైన వాగ్వాదము కూడా జరిగినట్టు తెలుస్తోంది. సంవత్సరాలుగా ఆర్మూర్ లో విగ్రహాల అమ్ముకునే రాజస్థానీ కళాకారులపై స్థానిక రాబందులు కన్నేయడంపై పట్టణవాసులు గుస్సుమంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments