తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో మర్యాదపూర్వకంగాసీఎం రేవంత్ ను కలిశారు.
శనివారం ఉదయం సీఎం ఇంటికి వెళ్లిన మహేష్ గౌడ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు. పార్టీ మరింత బలోపేతం చెయ్యాలని కోరారు. శాలువా కప్పి సత్కరించారు. అనంతరం మహేష్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని ప్రజా భవన్ లో కలిశారు.
