హైదారాబాద్ పోలీసు కమిషనర్ గా మరోసారి సీవి ఆనంద్ నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీచేసింది.
ఏసీబీ డిజి గా ఉన్న ఆనంద్ బిఆర్ యస్ ప్రభుత్వ హయాంలో హైదారాబాద్ సీపీ గా పనిచేసారు. కానీ ఎన్నికల కమిషన్ ఆయనను తప్పించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ డిజి గా పోస్టింగ్ ఇచ్చింది. ఆయన ఈసారి ఖచ్చితంగా డిజిపి అవుతారని భావించారు.కానీ మరోసారి హైదారాబాద్ కమిషనర్ గా నియామకం అయ్యారు.
సీపీ గా గత తొమ్మది మాసాలు పనిచేసిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అనూహ్యంగా బదిలీ అయ్యారు. తనను బదిలీ చేయాలని శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు.
ఇందులో భాగంగానే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదనపు డిజి పోస్టింగ్ ఇచ్చారు. అదనపు డిజి విజయ్ కుమార్ ఏసీబీ డిజి గా నియామకం అయ్యారు.
మహేష్ భగవత్ పోలీస్ వెల్ఫేర్ అదనపు డీజీ గా నియామకం అయ్యారు అలాగే ఐజి రమేష్ ను పోలీసు స్పోర్ట్స్ విభాగం ఐజి గా పోస్టింగ్ ఇచ్చారు.
