ఆబ్కారీ అధికారులు శుక్రవారం శుక్రవారం రాత్రి హైదారాబాద్ లో పలు ప్రముఖ పబ్ లలో సోదాలు చేశారు రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని అర్థరాత్రి నాలెడ్జ్ సిటీలోని క్యూరం పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఎక్స్సైజ్ పోలీసులు ఏడుగురికి డ్రగ్స్ టెస్ట్‌లు చేయగా అందులో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. డ్రగ్స్ తీసుకున్న వారిలో చిన్న నగేష్(వరంగల్ ), నోర్తు రవికుమార్ (శ్రీకాకుళం ) వగుర్తించారు. ఈ తనిఖీల్లో ఎక్స్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, అనిల్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ యాంటీ నార్కోటిక్ అధికారులు పాల్గొన్నారు.
