ఇటీవల దొంగలు దేన్నీ వదలడం లేదు. అగ్గిపుల్ల, సబ్బు బిల్లా కాదేది కవితకు అనర్హం అన్న శ్రీ శ్రీ మాటలు గుర్తుకు వస్తున్నాయి. దొంగలకు తాళం వేసిన ఇండ్లు, బడులు, గుడులు ఏవి చాలడం లేదనిపిస్తోంది.
గత వారం క్రితం పట్టణం లోని ప్రభుత్వ స్కూల్ లో చొరబడిన దొంగలు పాఠశాల లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బీరువాలో ఉన్న చిల్లర ఎత్తు కెల్లారు.
తాజాగా మజీద్ వద్ద ఉన్న నిఖిల్ కిరాణం షాప్ షట్టర్ ధ్వంసం చేసి షాప్ లోకి చొరబడ్డారు. షాప్ లోని చిల్లర డబ్బులు ఎత్తుకెల్లినట్టు షాప్ ఓనర్ దేవరశెట్టి రాజ ప్రసాద్ పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
దొంగల అలజడి పట్టణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా పోలీసులు రాత్రి వెళల్లో గస్తీ నిర్వహించలని పట్టణ .ప్రజలు కోరుతున్నారు
