HomeCRIMEనందిపేట్ లో పిచ్చి కుక్కల దాడి-పదిమందికి తీవ్ర గాయాలు -ప్రభుత్వాసుపత్రిలో చికిత్స -చర్యలు చేపట్టాలని కోరుతున్న...

నందిపేట్ లో పిచ్చి కుక్కల దాడి-పదిమందికి తీవ్ర గాయాలు -ప్రభుత్వాసుపత్రిలో చికిత్స -చర్యలు చేపట్టాలని కోరుతున్న స్థానికులు..

విశ్వాసానికి మారుపేరైన శునకాలు ఇటీవల వీధులలో విహంగం చేస్తూ ప్రజలని గాయపరచడమే కాకుండా, బాటసారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటనలు కోకొల్లలుగా కనబడుతున్నాయి.

అయితే నందిపేట మండలంలో ఈ వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్న స్థానిక అధికారులు వీటి నివారణ కోసం కనీస చర్యలు చేపట్టడం లేదని ప్రజలు అంటున్నారు.నందిపేట మండల కేంద్రంలో కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

చిన్న పెద్ద తేడా లేకుండా బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు.

మండల కేంద్రంలో బంగారు సాయి రెడ్డి ఫ్యాక్టరీ దగ్గర గల రామ్ రెడ్డి వెల్డింగ్ షాప్ నుండి మెయిన్ రోడ్డు వెంబడి లిటిల్ ఫ్లవర్ స్కూల్, చాకలి ఐలమ్మ, ఆనంది హాస్పిటల్, వ్యాన్ల అడ్డ, నట టాకీస్ కాంప్లెక్స్ ప్రాంతాల దగ్గర పిచ్చికుక్క పదిమందిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేసింది.

లిటిల్ ఫ్లవర్ స్కూలు విద్యార్థి, ఆనంద్ హాస్పిటల్ ఆయమ్మపై పిచ్చికుక్క తీవ్రంగా దాడి చేసి తొడ చేతి కండరాలను పీకేసింది. ఆనంద్ హాస్పిటల్ లో పనిచేసే బొమ్మన లసుంబాయి ఆయమ్మ కు తీవ్రంగా గాయమైందని, ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని మెడికల్ ఆఫీసర్ డా:ప్రవీణ్ తెలిపారు.

ఏది ఏమైనా మండల కేంద్రంలో కుక్కల బెడద నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అధికారులు, గ్రామ అభివృద్ధి కమిటీ తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments