నగరంలోని పేకాట స్థావరంపై మూడవ టౌన్ పోలీసులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు.
ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని దుబ్బ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట ఆడుతున్న 6గురినీ పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వారి నుంచి రూ.8340 నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం పరుచుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ పేర్కొన్నారు.
