ధర్పల్లి కి చెందిన మౌనిక అనే మహిళకు పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారాన్ని అందించారు.
బుదవారం మౌనిక ను అంబులెన్స్ లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది శేఖర్ గౌడ్ సుఖ ప్రసవం చేశారు.మౌనిక పండంటి బిడ్డ కు జన్మనిచ్చింది.
తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు. తమ బిడ్డకు ప్రసవం చేసిన 108 అంబులెన్స్ సిబ్బందికి మౌనిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
