మద్యం మత్తులో ప్రమాదవశాత్తు మాక్లూర్ మండలంలోని మాదాపూర్ వద్ద ఉన్న కాలువలో పడి వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన గోపాయి రాజు(40) ఇంట్లో తల్లిదండ్రులలో ఉంటున్నాడు.ఈ నెల 9న ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు తెలిపారు.
ఈ మేరకు మంగళవారం మద్యం మత్తులో కాలువలో పడి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
