HomeTelanganaNizamabadమంత్రి పదవీ రాకముందే ప్రోటోకాల్ ......పాలనాధిపతులతో సుదర్శన్ రెడ్డి రివ్యూ ......

మంత్రి పదవీ రాకముందే ప్రోటోకాల్ ……పాలనాధిపతులతో సుదర్శన్ రెడ్డి రివ్యూ ……

మంత్రి పదవీ కోసం దాదాపు ఎనిమిది మాసాలుగా ఎదురుచూస్తున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎట్టకేలకు ప్రోటోకాల్ పక్కకు నెట్టేసి రంగంలోకి దిగారు

. జిల్లా పాలనాధిపతులతో అధికారిక భేటీ లు మొదలు పెట్టారు.మొదటి సారిగా ఆయన పోలీసు కమిషనరేట్ లో కలెక్టర్ కమిషనర్ లతో పాటు మున్సిపల్ కమిషనర్ లతో రివ్యూ సమావేశం నిర్వహించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఇంచార్జ్ గా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ హోదా లో ఉన్నారు. ఆయన రెండు రోజుల క్రితమే నగరంలో మూడు రోజులు విస్తృతంగా పర్యటించారు. అయినప్పటికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నగరంలో గణేష్ నిమజ్జనం ఉత్సవాల ఏర్పాట్ల ను రివ్యూ చేయడం అధికార పార్టీలోనూ హాట్ టాపిక్ అయింది.

మొన్నటి దాక తాను ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్ సెగ్మెంట్ వ్యవహారాలకే పరిమితంగా వుంటూ వచ్చిన సుదర్శన్ రెడ్డి ప్రోటోకాల్ రూల్స్ ను పక్కకు పెట్టేసి కమిషనర్ కలెక్టర్ లను వెంట బెట్టుకొని ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ లను సైతం చుట్టేస్తున్నారు. ఆయా సెగ్మెంట్ లలో పాలన పార్టీ వ్యవహారాలను సైతం ఆయన అరా తీస్తుండడం వెనుక ఆంతర్యం ఎవరికి అంతు చిక్కడం లేదు.

ఈసారి మంత్రి మంత్రి వర్గ విస్తరణ లో సుదర్శన్ రెడ్డి కి జిల్లా నుంచి బెర్త్ ఖాయం అయింది. అయినప్పటికి మంత్రి పదవీ రాకముందే ఆ హోదా లో కి వెళ్లడం వెనుక కారణాలను సొంత పార్టీ నేతలు వాకబు చేస్తున్నారు.

ఆయనకు అధికార ప్రోటోకాల్ లేక పోవడం వల్లే ఇటీవల స్వాత్రంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరణ బాధ్యత ను మినరల్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ అనిల్ ఇరవత్రి కి అప్పగించారు.

మొన్నటి దాక ప్రోటోకాల్ నిబంధనలకు లోబడే వుంటూ వచ్చిన సుదర్శన్ రెడ్డి పాలనా వ్యవహారాల్లో కొద్దీ రోజులుగా క్రియాశీలకంగా ఉండడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి క్యాబినెట్ బెర్త్ ఖాయమనే ధీమాతో వుంటే సమీకరణాల నేపథ్యంలో ఆయన కు చాన్స్ దక్కలేదు.

కానీ మంత్రి వర్గ విస్తరణ లో అవకాశం ఖాయమని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడంతో ఆయన విస్తరణ కోసం ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్నారు.

మంత్రి పదవి లేక లేకపోవడంతో పాలనా వ్యవహారాలను ఆయన పట్టించుకోలేదు. ముఖ్య అధికారులు ఆయనతోనే టచ్ లో ఉన్నాసరే బోధన్ సెగ్మెంట్ కె పరిమితం అవుతూ వచ్చారు.

కానీ కొద్దీ రోజులుగా ఆయన రూట్ మార్చారు. కలెక్టర్ కమిషనర్ లకు కీలక వ్యవహారాల్లో దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. వారుకూడా ఆయన చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారనే టాక్ ఉంది.

అర్బన్ సెగ్మెంట్ లో ఎమ్మెల్సీ గా మహేష్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ లున్న సరే సుదర్శన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు నిజామాబాద్ నగరంలో దశాబ్దాలుగా అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు.

ఎలాంటి వైఫల్యాలకు తావులేకుండా ఈ ఉత్సవాలు జరిగేలా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments