విద్యుదాఘాతానికి గురై ఆవు మృతిచెందిన సంఘటన మాకు మండలంలోని దాస్ నగర్ లో చోటు చోటుచేసుకుంది.
దాస్ నగర్ గ్రామానికి చెందిన ద్యారంగుల నగేష్ రోజు మాదిరిగానే ఈనెల 8న ఆవును వ్యవసాయ పొలం వద్ద ఆవులను మేపి ఇంటికి తీసుకొచ్చి కట్టేసాడు.
అది తెంపుకుని కనిపించలేదు.బుదవారం పొలం పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గర మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వైర్లకు ఆవు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.పాడి ఆవు విలువ రూ.లక్ష ఉంటుందని నగేష్ తెలిపారు.
