HomeTelanganaNizamabad15న మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణం స్వీకారానికి భారీగా హాజరుకావాలని --...

15న మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణం స్వీకారానికి భారీగా హాజరుకావాలని — జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఈనెల 15వ హైదరాబాద్లోని గాంధీభవన్ లో బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి జిల్లా నుంచి నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలి రావాలని డీసీసీఅధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కోరారు

ఆయన శుక్రవారం డీసీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు ,చిన్న కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ గ మన జిల్లా వాస్తవ్యుడు కావున జిల్లా నుండి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మోహన్ రెడ్డి కోరారు,

15వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీభవన్ నందు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారని అక్కడికి వెళ్లడానికి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బాధ్యులు ఆధ్వర్యంలో మండలాల అధ్యక్షులు ఆధ్వర్యంలో జన సమీకరణ జరుగుతుందని, ఎప్పటికప్పుడు నియోజకవర్గ బాధ్యులను నాయకులు సంప్రదించాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments