పెద్దలు తమ ప్రేమను అంగీకరించక పోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మ హత్యకు పాల్పడ్డారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపుర్‌కు చెందిన సాయి కుమార్ (24), వీణ (22) ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ప్రేమికులిద్దరూ ఉరేసుకుని ఆత్మ హత్య కు పాల్పడ్డారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
