Monday, April 27, 2026
HomePOLITICAL NEWSUncategorizedరైల్వే స్టేషన్లలో ప్రత్యేక డాగ్ స్క్వాడ్ బృందాల పరిశీలన...

రైల్వే స్టేషన్లలో ప్రత్యేక డాగ్ స్క్వాడ్ బృందాల పరిశీలన…

నిజామాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక టీంతో పాటు డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ,నిజామాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీసులు రైల్వే పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్యం,ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మాదకద్రవ్యాలు, గుట్కా, వంటి వాటిని అరికట్టేందుకు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మీద ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

అలాగే డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది తో ముమ్మరంగా రైల్వేస్టేషన్‌ పరిసరప్రాంతాలు, పార్సెల్‌ సర్వీస్‌ కేంద్రాలు, ప్రయాణికులు ప్రయాణించే రైల్వే బోగీలను,అనుమానాస్పదంగా కనిపించే ప్రతి పార్సిల్‌,రవాణా బ్యాగుల‌ను తనిఖీ చేశారు.

ఈ తనిఖీలో ఒకటవ టౌన్ ఏ ఎస్ఐ లాయక్ అలీ, డాగ్ స్క్వాడ్ ఇంచార్జ్ మోహన్ రైల్వే పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!