HomeCRIMEనగరంలో వ్యక్తి అదృశ్యం...

నగరంలో వ్యక్తి అదృశ్యం…

నిజామాబాద్ నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోని ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. సీఐ విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.

నిర్మల్ జిల్లా,పొనుకల్ మండలం, అనంతపెట్ గ్రామానికి చెందిన బొజ్జ ఎర్రన్న(55).గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

శనివారం ఎవ్వరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయాడు.

సదరు కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో ఒకటవ టౌన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ విజయ్ బాబు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments