ప్రముఖ సినీనటుడు నిర్మాత మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఆయన ఇచ్చిన పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
రాచకొండ పొలీస్ కమిషనరేట్ పరిధి లోని జల్ పల్లిలోని ఆయన నివాసం లో రూ.10 లక్షలు చోరీ అయ్యాయని స్వయంగా మోహన్ బాబు మంగళవారం రాత్రి రాచకొండ సీపీ కి ఫిర్యాదుచేశారు .
తన ఇంట్లో పనిచేసే నాయక్ మీదే మోహన్ బాబు అనుమానం వ్యక్తం చేయడం తో పరారీ లో ఉన్న నాయక్ ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.
