HomeTelanganaNizamabadనిజామాబాద్ లో ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం...

నిజామాబాద్ లో ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం…

జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు…నిజామాబాద్ లో ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.

నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేద ప్రజల ను దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల ను ఇంజినీరింగ్ కళాశాల తెరిచి దిద్దుతమని పేర్కొన్నారు.

అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 100 శాతం నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టారనీ పేర్కొన్నారు.

అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని, దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు.

అలాగే ప్రభుత్వ పరిపాలన పూర్తి పారదర్శకంగా ఉండాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. అలాగే రైతు రుణమాఫీ 100 చేస్తానని చెప్పారు.తమ ప్రభుత్వంలో తప్పకుండా ప్రతి శాఖపై మార్పు కనిపించేలా పాలన ఉంటుందనీ పేర్కొన్నారు.

అలాగే ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో పాఠశాలలపై దృష్టి పెట్టాలని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేశ్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నీతూ కిరణ్, మనల మోహన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments