నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోతంగాల్ గ్రామానికి చెందిన సయ్యద్ మౌలానా(53).
డ్రైవర్ గా పని చేస్తారు. మౌలానా, తన భార్య ఇద్దరు కలిసి కృష్ణ ఎక్స్ప్రెస్ లో నెల్లూరు నుంచి నిజామాబాద్ వచ్చారు. అర్థరాత్రి అయిన కారణంగా రైల్వే స్టేషన్ లోనే నిద్రించారు.
మౌలానా మానసిక స్థితి సరిగ్గా లేక భార్యకు చెప్పకుండా వెళ్లి పోయాడు. కాసేపటికి భార్య చుట్టుపక్కల ఆచూకీ కోసం గాలించినా లభ్యం కాకపోవడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు 8712658591 నంబర్ కు ఫోన్ చేసి తెలపగలరని ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
