Tuesday, April 21, 2026
HomeTelanganaNizamabadబతుకమ్మ, దసరా పండుగలకు 482 ప్రత్యేక బస్సులు...తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

బతుకమ్మ, దసరా పండుగలకు 482 ప్రత్యేక బస్సులు…తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

నిజామాబాద్బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్.టి.సి. రీజినల్ మేనేజర్ కె. జాని రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిజామాబాదు నుండి జె.బి.యస్ వరకు, జె.బి.యస్ నుండి నిజామాబాదు వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు కలదు. పండుగ రద్దీ కారణంగా ప్రయాణీకుల సౌకర్యార్థం మంగళవారం నుంచి ఈ నెల15 వరకు అదనముగా మరో 482 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

రీజియన్ లోని నిజామాబాదు-1, నిజామాబాదు-2, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి ఆరు డిపోలు జె.బి.యస్ వరకు నడుపుతున్నట్లు తెలిపారు. అలాగే ఇతర ప్రదాన రూట్లలో కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు.

దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులు ముందస్తు రిజర్వేషన్ కొరకు www.tsrtcoline.in అనే వెబ్ సైట్ లో రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!