బతుకమ్మ పండగ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి…నిజామాబాద్ లోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్ మకరంద్ మంగళవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడతారని అందుకు అనుగుణంగా బతుకమ్మ పండగ ను పురస్కరించుకొని రఘునాథ చెరువు ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
