తిరుపతి లడ్డు వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.I
స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే మంచిదని.. అప్పుడే అందులో రాజకీయ జోక్యం ఉండదని జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాటే చేయబోయే కొత్త సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్రం ఏర్పాటు చేసిన సిట్ నుంచి ఇద్దరు ఉంటారని పేర్కొన్నారు.
అదేవిధంగా FASSAI నుంచి కూడా ఓ నిపుణుడిని కూడా సిట్‌లో భాగస్వామిగా చేయాలన్నారు. ఆ మొత్తం దర్యాప్తు ను సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ స్వయంగా పర్యవేక్షిస్తారని ..
ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండ కూడదని జస్టిస్ బీఆర్ గవాయ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని ఆయన స్పష్టం చేశారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ మేరకు శుక్రవారం మరోసారి ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది
