మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో గత రాత్రి ఓ మహిళను మంత్రాలు చేస్తుందని సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది.
గ్రామానికి చెందిన ముత్తెవ్వ అనే మహిళ గ్రామంలో మంత్రాలు చేస్తుందని అనుమానించిన గ్రామస్తులు గురువారం రాత్రి ఆమె ఇంటి మీద దాడి చేసిన తీవ్రంగా చితకబాది ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించారు గ్రామస్తుల దాడితో ఆమె కొడుకు కోడలు ఇంటి వెనుక వైపు నుంచి గ్రామం వదిలి పారిపోయారు.
తీవ్రంగా గాయపడిన ముత్తవ్వ ను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు కానీ ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందింది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
