నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ క్యాంటీన్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
ఈ క్యాంటీన్ల ఏర్పాటు వల్ల మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా స్థానిక ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించవచ్చన్నారు.
అలాగే మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు మహిళా శక్తి కార్యక్రమంలో ఎంతో తోడ్పడుతుందనీ పేర్కొన్నారు.
