నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ట్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి వేధింపులే ఈ అఘాయిత్యానికి కారణమని విశ్వసనీయ సమాచారం.
ట్యూటర్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన విద్యార్థిని, శుక్రవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి, ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
