HomeTelanganaNizamabadప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని మదన్‌పల్లి...

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని మదన్‌పల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మంజుల పిలుపునిచ్చారు.

మంగళవారం మదన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మంజుల మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి, బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మదన్‌పల్లి గ్రామ ఉప సర్పంచ్ రాస మహేష్, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments