HomeLaw and Orderప్రైవేట్ కళాశలలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలి..జిల్లాలో మూతబడిన ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు..

ప్రైవేట్ కళాశలలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలి..జిల్లాలో మూతబడిన ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు..

.రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల్లో ప్రభుత్వ తాత్సారం..కాలేజీ యాజమాన్యాలు నిరసన…ప్రైవేట్ కళాశలలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.

బుదవారం నగరంలో ప్రైవేట్‌ కళాశాలల అసోసియేషన్‌ కో-ఆర్డినేటర్‌ నరాల సుధాకర్‌ మాట్లాడుతూ..విద్యార్థులకు మూడేండ్ల నుంచి ఉపకార వేతనాలు రావడంలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులకు కొన్ని నెలల నుంచి జీతభత్యాలు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు ఆందోళన వ్యక్తం చేసారు.

ఆర్థిక కారణాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావొద్దనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘బోధనా రుసుముల చెల్లింపు పథకం’పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.

విద్యార్థులను ఫీజులు అడగలేక ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు పొందలేక, భవన అద్దె, జీతభత్యాలు, నిర్వహణ వ్యయం భరించలేక, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక చివరకు మూసి వేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించే స్థాయికి ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు చేరుకున్నాయనీ ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ,పీజీ కళాశాలలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments