తాళం వేసిన ఇంట్లో చోరి జరిగిన సంఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో బుదవారం రాత్రి చోటుచేసుకుంది.
ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని సీతారాం నగర్ కాలనీలో తాళం వేసినా ఓ ఇంట్లో అర్ధరాత్రి ముగ్గురు దొంగలు తాళం పగల గొట్టి ఇంట్లొకి చొరబడి బీరువా తెరిచి అందులోని 4గ్రాముల బంగారం, రూ.25 వేల నగదు అపహరించి పరారయ్యారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.
