అక్రమంగా తరలిస్తున్న 16.4 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్పల్లి మండలంలోని వాడి సమీపంలోని రోడ్డు ద్వారా రేషన్ బియ్యం అశోక్ లేలండ్ లో తరలిస్తున్నారన్న సమాచారం అధికారులకు అందడంతో దాడులు నిర్వహించారు.
బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పరిశీలించగా అందులో 16.4 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
