HomeCRIMEపోలీసుల అదుపులో పద్మక్క? ఆసుపత్రికి వెళ్తుండగా సరిహద్దులో పట్టుకున్న పోలీసులు ?

పోలీసుల అదుపులో పద్మక్క? ఆసుపత్రికి వెళ్తుండగా సరిహద్దులో పట్టుకున్న పోలీసులు ?

మావోయిస్టు పార్టీ సీనియర్ నేత సెంట్రల్ కమిటీ మెంబర్ ఛత్తీస్ ఘడ్ స్పెషల్ జోన్ కమిటీ ఇంచార్జ్ పటేల్ పద్మక్కఅలియాస్ సుజాత పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఆమె ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం లో పనిచేస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె మెరుగైన చికిత్స కోసం వెళ్తుండగా కొత్తగూడెం వద్ద అదుపులోకి తీసుకున్నారు. పద్మక్కది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోని జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడ.

పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి సుదర్శన్ రెడ్డి పరిచయంతో విప్లవ భావాలకు ఆకర్షితరాలై రాడికల్స్ స్టూడెంట్ యూనియన్ లో క్రియాశీలకంగా పనిచేసింది .అనంతరం డిగ్రీని మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ చేరుకుంది.

అక్కడే పీపుల్స్ వార్ తో అనుబంధం పెరిగింది మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ ని వివాహం చేసుకుంది. పార్టీలో అంచలంచల ఎదిగిన ఈమె కేంద్ర కమిటీ సభ్యురాలుగా ప్రస్తుతం పని చేస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా వయసు రిత్యా అనారోగ్య సమస్యలకు గురైంది .

ఈ నేపథ్యంలో ఆమె చతిస్గడ్ నుంచి ఆరోగ్యాన్ని చూపించుకునేందుకు వచ్చే క్రమంలో పోలీసులు పక్క సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments