Tuesday, April 21, 2026
HomeTelanganaNizamabadడిగ్రీ,పీజీ కళాశాలలు పునః ప్రారంభం...

డిగ్రీ,పీజీ కళాశాలలు పునః ప్రారంభం…

డిగ్రీ పీజీ కళాశాలలో పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని చేపట్టిన నిరవధిక బందును విరమించి శుక్రవారం నుంచి కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయనీ తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అంబోజీ హరిప్రసాద్ తెలిపారు.

గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుతో పాటు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేష్ ను కలిసి మాట్లాడి వారు ఇచ్చిన హామీ మేరకు బంద్ ను విరమించుతున్నట్లు పేర్కొన్నారు.గత ఏడాది లో జారీ చేసిన టోకెన్స్ మొత్తమును వారం రోజుల లో విడుదల చేస్తామని టీపీడీపీఎంఏ రాష్ట్ర నాయకత్వంలో జరిపిన చర్చల్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేష్ హామీ ఇచ్చారు.

ప్రభుత్వంతో చర్చించడంలో సహకరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య,టీపీడీపీఎంఏ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!