24 గంటల్లో రాబరీ కేసుని ఛేదించిన పోలీసులు…
నగరంలోని ఓ చోరి కేసులో ఇద్దరు వ్యక్తులను 24 గంటల్లో ఛేదించి రిమాండ్ చేస్తున్నట్లు మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ తెలిపారు.వివరాల్లోకి వెళ్లితే న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన చిందిం సిద్ది రాములు ఇంట్లో ఈ నెల 16 న గుర్తు తెలియని దుండగులు ఆయన్ మేడలోనుంచి రెండు తులాల బంగారం అపహరించి పరారయ్యారు.
దీంతో బాధితుడు మూడవ టౌన్ లో ఫిర్యాధు చేయగా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా చెందించారు. దొంగలించడానికి సహాయం చేసిన ఆటో డ్రైవర్ కరీం, దొంగతనానికి పాల్పడిన నజీమ్ లను పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి రెండు సెల్ ఫోన్లు,కత్తి,బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
