నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సంవత్సరం బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే మద్నూర్ కు చెందిన పిట్లా రాజు,లక్ష్మి కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు తన భార్య లక్ష్మి అనారోగ్యం కారణంగా శుక్రవారం రాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
రాత్రి సమయంలో తన కొడుకు మణికంఠ(1) సంవత్సరం బాలుడితో కలిసి ఆస్పత్రిలోనే పడుకున్నారు. తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు పక్కలో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్రలేచిన బాలుడి తల్లిదండ్రులు పక్కలో పడుకున్న కొడుకు కనిపించక పోయేసరికి ఆందోళనకు గురై ఆస్పత్రి అంతా వెతికాడు.
ఎక్కడా కనిపించక పోవడంతో తన కొడుకు కిడ్నాప్‌కు గురైనట్లు గ్రహించి ఒకటో టౌన్ పోలీసులు సమాచారం అందించారు.పోలీసులు ఆస్పత్రిలోని సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు.బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు బాలుడిని ఎటువైపు తీసుకెళ్ళారనే విషయాన్ని తెలుసుకోడానికి ఆస్పత్రి పరిసరాల్లో ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
